Road Accident : కేరళ(Kerala) లోని ఆదిమాలి ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. పర్యాటకులను తీసుకెళ్తున్న టూరిస్ట్ వాహనం(Tourist Vehicle) ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడినట్లు సమాచారం. కేరళ పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
టూరిస్ట్ వాహనం తమిళనాడు(Tamilnadu) నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత క్షతగాత్రులు కేకలు వేయడంతో స్థానికులు వారిని గుర్తించి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం అదుపుతప్పడానికి గల కారణాలు తెలియలేదు.
ఇదిలా ఉంటే... సోమవారం తెల్లవారుజామున, భారత నౌకాదళానికి చెందిన రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్(RPA) సాధారణ శిక్షణా విమానంలో కూలిపోయింది. కొచ్చిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒక సాధారణ శిక్షణా విమానంలో భారత నావికాదళ విమానం రన్‌వేకి ఒక మైలు దూరంలో కూలిపోయిందని నేవీ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి!