/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/JP-NADDA-jpg.webp)
BJP national president JP Nadda: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. వాళ్ళు ఓడిపోతున్నామని తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. దేశాన్ని తప్పుదోవ పట్టించడం, గందరగోళానికి గురిచేయడమే ఇండియా కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు.
ALSO READ: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష సీఎంలు అరెస్ట్ అవుతారు.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రజల అపారమైన ఆశీర్వాదాలను మోదీ పొందుతున్నారని అన్నారు. ఇండియా కూటమికి ప్రధాని మోదీపై నిందలు మోపడానికి ఎలాంటి అధరాలు లేవని.. అందుకే ఆయన వయసు అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత సెప్టెంబర్ 17న మోదీ కి 75 ఏళ్ళు నిండుతాయని.. కాగా బీజేపీ పార్టీలో 75 ఏళ్లు దాటిన వ్యక్తికి ప్రధాని అయ్యే అవకాశం ఉండదని ఈరోజు సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. కాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అలాంటి పద్ధతులు లేవని.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు.
BJP national president JP Nadda tweets, "Kejriwal and the entire INDI alliance have panicked after realizing their failure in the elections. Their aim is to mislead and confuse the country. Modi Ji is getting the immense blessings of the people from East to West, North to South.… pic.twitter.com/kyykpIR7XL
— ANI (@ANI) May 11, 2024