Keerthy Suresh: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసి.. తాను పెళ్లికి సిద్ధమైపోయినట్లు చెబుతూ షాక్ ఇవ్వగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పెళ్లికి సిద్ధమైనప్పుడు అది తప్పనిసరి..
ఈ మేరకు సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా సీనియర్ నటీమణులంతా పెళ్లిబాట పడుతున్న విషయం తెలిసిందే. కాగా కీర్తి సురేష్ పెళ్లి విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రేమలో పడ్డట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఎన్నడూ స్పందించని కీర్తి సురేష్.. ఫస్ట్ టైమ్ తన పెళ్లి గురించి స్పందించింది. ఈ మేరకు తమ సన్నిహితుల పెళ్లికి హాజరవడానికి వెళ్తున్న నటి.. 'పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి' అంటూ సెల్ఫీ పోస్ట్ చేసింది.
దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు పెళ్లికి సిద్ధం అయ్యావా.. లేదా ఎవరి పెళ్లికైనా రెడీ అయ్యావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయ్యే పెళ్లి చేసుకుంటే మేము ఏమై పోవాలంటూ బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఇష్యూతో కీర్తి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.