Keerthy Suresh: ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చిన నటి.. పెళ్లి పోస్ట్ వైరల్! యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ తన పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. సన్నిహితుల పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు తెలిపిన నటి ''పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి' అంటూ ఫొటో పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. By srinivas 16 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Keerthy Suresh: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసి.. తాను పెళ్లికి సిద్ధమైపోయినట్లు చెబుతూ షాక్ ఇవ్వగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. పెళ్లికి సిద్ధమైనప్పుడు అది తప్పనిసరి.. ఈ మేరకు సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా సీనియర్ నటీమణులంతా పెళ్లిబాట పడుతున్న విషయం తెలిసిందే. కాగా కీర్తి సురేష్ పెళ్లి విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రేమలో పడ్డట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఎన్నడూ స్పందించని కీర్తి సురేష్.. ఫస్ట్ టైమ్ తన పెళ్లి గురించి స్పందించింది. ఈ మేరకు తమ సన్నిహితుల పెళ్లికి హాజరవడానికి వెళ్తున్న నటి.. 'పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి' అంటూ సెల్ఫీ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు పెళ్లికి సిద్ధం అయ్యావా.. లేదా ఎవరి పెళ్లికైనా రెడీ అయ్యావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయ్యే పెళ్లి చేసుకుంటే మేము ఏమై పోవాలంటూ బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఇష్యూతో కీర్తి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) Also Read: జగన్ ను రాయితో కొట్టిన సతీష్ ఇతనే..! #keerthy-suresh #marriage-post మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి