Children Care Tips : పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తల్లిదండ్రులు(Parents) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లని వదిలి వెళ్లాల్సి వస్తే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా బిజీగా ఉంటున్నారు. చాలా సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో ఒంటరి(Children At Home Alone) గా వదిలివెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి సమయంలో పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారో అన్న అభద్రతాభావం ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది.
పిల్లలకు భద్రత గురించి చెప్పాలి:
- పిల్లలు(Children's) ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా అపరిచితులు వస్తే తలుపులు తెరవకూడదని చెప్పాలి. అంతేకాకుండా గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడకూడదని చెప్పాలి. అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలో వివరించాలి. దీనివల్ల పిల్లలు తమను తాము రక్షించుకోగలుగుతారు.
ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లు:
- ఎప్పుడూ పిల్లలకు మీ ఫోన్ నంబర్‌లు(Your Phone Numbers), మీ సన్నిహితుల ఫోన్ నెంబర్లు(Relatives Phone Numbers) ఇవ్వాలి. ఆ నెంబర్లను పిల్లలు గుర్తుంచుకునేలా చేయాలి. అంతేకాకుండా పిల్లలకు కనిపించేలా ఆ నెంబర్లను ఎక్కడైనా రాసిపెట్టండి. అలాగే పోలీసు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ వంటి అత్యవసర సేవల నెంబర్లు(Ambulance Phone Numbers) కూడా చెప్పండి. ఎందుకంటే ఏదైనా ప్రమాద పరిస్థితుల్లో వాళ్లు ఈ నెంబర్లకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది.
ఆహారం ఏర్పాట్లు:
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రిజ్, వంటగదిలో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచండి. శాండ్‌విచ్‌లు, పండ్లు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. అలాగే ఆహారాన్ని వేడి చేయడం, కొన్ని చిన్నచిన్న వంటకాలను ఎలా సిద్ధం చేసుకోవాలో నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు.
వినోదం:
- మీ పిల్లల ఒంటరి తనాన్ని పోగొట్టడానికి వాళ్లకు ఇష్టమైన పుస్తకాలు, గేమ్స్ అన్ని ఏర్పాటు చేయాలి. దీని వల్ల వాళ్లు బిజీగా గడపడమే కాకుండా వారి ఆలోచనా సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : మెదడులోని నరాలు పగిలితే ఏమవుతుంది?.. అలా జరగడానికి కారణాలేంటి?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.