KCR: నా బిడ్డ జైలులో ఉంటే బాధగా ఉండదా.. అగ్నిపర్వతంలా ఉన్నా: కేసీఆర్ రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా నాకు బాధ ఉండదా. నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. వారంతా బీఆర్ఎస్ ను అబాసుపాలు చేసే పనిలో ఉన్నారు'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telagana: సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా తనకు బాధగా ఉండదా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా.. ఈ మేరకు ‘నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించాను. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయింది. పాలనపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ ను అబాసుపాలు చేసే పనిలో ఉంది. శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతాయి? ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే.. పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని పార్టీ నేతల్లో ధైర్యం నింపారు. ఇక శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు కేసీఆర్. #brs #kcr #kaitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి