Etela Rajender: తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమే

గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పరకాలలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తలరాతలు మారుతాయని తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు.

New Update
Etela Rajender: కేసీఆర్‌లాగే రేవంత్ చేస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పరకాలలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తలరాతలు మారుతాయని తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల, నిరుద్యోగుల తలరాతలు ఏమాత్రం మార్చలేదన్నారు. కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బీజేపీ కుటుంబాలకు అతీతంగా ఉండే పార్టీ అన్న ఆయన.. బీజేపీలో అలాంటివి ఉండవన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. నిజాం రాజుల నుంచి తెలంగాణను భారత ప్రభుత్వం ఎలా కాపాడుకుందో తెలియజేసే రోజన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ స్వాతంత్ర్యం వచ్చిన రోజన్న ఈటల.. ప్రస్తుతం మాత్రం సెప్టెంబర్‌ 17 అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం పోయిన రోజు అయిందన్నారు. సెప్టెంబర్‌ 17న రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని జరిపి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది బీజేపీ అన్నారు. కానీ కేసీఆర్‌ ఏనాడూ తెలంగాణ విమోచన దీనోత్సవాన్ని నిర్వహించలేదని విమర్శించారు.

కేసీఆర్‌ కూడా ఓ నియంత పాలన సాగిస్తున్నారన్న ఈటల.. అందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రగతి భవన్‌లో కూర్చొని పాలన సాగిస్తున్న వ్యక్తిని నియంత అనడంలో తప్పులేదన్నారు. వర్షాల వల్ల రైతులు సర్వం కోల్పోతున్నా.. కేసీఆర్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూడా వ్యవహరించడం లేదన్నారు. మరోవైపు కేసీఆర్‌ తనను ఓడించేందుకు హుజూరాబాద్‌లో సుమారు 700 కోట్లు ఖర్చు చేశారని ఈటల రాజేందర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో అందరు కలిసి కేసీఆర్‌ను బొంద పెడుతారని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు