KCR: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

చలో నల్గొండ సభలో రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో నిమిషం పోనీ కరెంట్.. కాంగ్రెస్ హయాంలో గడియ గడియకు పోతుందని ఆరోపించారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టి సభ నిర్వహించే దుస్థికి తెలంగాణకు వచ్చిందని ఫైర్ అయ్యారు.

New Update
KCR: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR in Chalo Nalgonda Meeting: చలో నల్గొండ సభలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ (Congress) చేస్తుందని అనియు మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు (Rythu Bandhu) ఎందుకు ఇవ్వలేదని అని ప్రశ్నించారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కోరుతామని కాంగ్రెస్ మంత్రి అంటున్నారని ఫైర్ అయ్యారు. రైతుల కాళ్లకు కూడా చెప్పులు ఉంటాయని.. వాళ్లకు కూడా కొట్టడం వచ్చని హెచ్చరించారు.

అసెంబ్లీలో జనరేటర్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో కరెంట్ సమస్యలు (Power Cuts) మొదలైయ్యాయి అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చీకట్లో ఉన్న తెలంగాణకు (Telangana) వెలుగులు తెచ్చానని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ సమస్యల వల్ల అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన సన్యాసులు కాంగ్రెస్ వాళ్ళు అని చురకలు అంటించారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి నిండుగా ఉందని.. అలాంటప్పుడు కరెంట్ ఎందుకు ఇస్తలేరని ఫైర్ అయ్యారు.

ఎన్ని గుండెలురా మీకు..

బిడ్డా జాగ్రత్త, వెంటపడతాం, వెంటాడతాం అని కేసీఆర్‌ (KCR) ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వటం కూడా చేతకాదా అని అన్నారు. ఎన్ని గుండెలురా మీకు అంటూ ఫైర్ అయ్యారు. నన్ను చంపుతారా దా... చూసుకుందాం.. నన్ను చంపి మీరు బ్రతుకుతారా? అని మండిపడ్డారు.కేసీఆర్‌ పోగానే కరెంట్‌ పోతుందా.. కరెంట్‌కు మాయం రోగం వచ్చిందా? అని అన్నారు. దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. చేతగాని చవటలు ఉంటే ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు.

Also Read: కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెప్పారు - రేవంత్‌ రెడ్డి

Advertisment
తాజా కథనాలు