Chalo Nalgonda Meeting: కృష్ణా జలాల్లో (Krishna River) తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన చలో నల్గొండ సభలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు కేసీఆర్. కృష్ణా జలాలు జీవన మరణ సమస్య అని పేర్కొన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకులు లేవు. గతంలో ఫ్లోరైడ్ సమస్య వల్ల నల్గొండ జిల్లా ప్రజల నడుములు వంగిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య (Nalgonda Fluoride Issue) తగ్గిందని అన్నారు. కొంత మందికి వ్యతిరేకంగా పెట్టిన సభ కాదని అన్నారు. తెలంగాణ నీళ్ల సమస్యలపై మాట్లాడే సభ అని అన్నారు.
ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి
నా కాలు ఇరిగినా ...
నా కాలు ఇరిగినా సభకు వచ్చానని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై కొంతమంది సన్నాసులు తెలివిలేక మాట్లాడుతున్నారని అన్నారు. ఈ సభ తమకు వ్యతిరేకమని కొందరు అనుకుంటున్నారని తెలిపారు. ఇవ్వెత్తున ఉద్యమంలా ఎగిసిపడకపోతే.. ఎవడూ మనల్ని రక్షించలేడని అన్నారు. కేంద్రానికి ఈ సభ ఒక హెచ్చరిక అని మోడీ సర్కార్ ను (PM Modi) హెచ్చరించారు. మన నీళ్లు దొంగతనం చేసే వాళ్లకు ఇదో హెచ్చరిక అని అన్నారు. నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఇచ్చాం అని తెలిపారు. ఆముదాల మాత్రమే పండిన నల్లగొండలో లక్షల టన్నుల వడ్లను పండించాం అని హర్షం వ్యక్తం చేశారు.
అదీ మగోడు చేయాల్సి పని..
ఏడాది కోసం కృష్ణా నీళ్లను సర్దుబాటు చేసుకోమని ఆనాటి కాంగ్రెస్ చెప్పిందని అన్నారు కేసీఆర్. ఇబ్బంది కాకూడదని ఆ రోజు సర్దుబాటు చేసుకున్నాం అని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా నీళ్ల పంపకాలు చేయలేదని ఫైర్ అయ్యారు. కొత్త ట్రిబ్యునల్ వేస్తామని చెప్పి వేయలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ట్రిబ్యునల్ వేశారని అన్నారు.
ఏ ప్రభుత్వమైనా మన బాధలు చెప్పి మన వాటా కోసం కొట్లాడాలని హితవు పలికారు. అదీ మగోడు చేయాల్సి పని అని అన్నారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి మీరు దున్నపోతును తెచ్చుకున్నారని చురకలు అంటించారు. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించేశారని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్‌కు (Uttam Kumar Reddy) ఉమ్మడి రాష్ట్రమే మేలని అన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. హరీష్ రావు (Harish Rao) వెంటనే గర్జించాడని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టె కాలే వరకు పులిలా కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండను అని అన్నారు.
DO WATCH: