KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్‌ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు!

'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గజ్వేల్ ఎమ్మెల్యే కనబడుటలేదంటూ పట్టణంలో పోస్టర్లు అంటించారు. అందుబాటులోలేని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

New Update
KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్‌ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు!

KCR Missing Posters in Gajwel: మాజీ సీఎం, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీర్ కనడుట లేదంటూ గజ్వేల్‌ నియోజక వర్గంలో పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా నియోజక వర్గానికి రాలేదంటూ స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ (BJP) నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు 'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అంటూ నినాదాలు చేశారు. అలాగే గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, బస్టాప్, అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ ఆఫీస్, ఇంద్ర పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో కేసీఆర్ కనబడడం లేదంటూ పోస్టర్స్ అంటించారు.

గజ్వేల్ ప్రజలపైన ప్రేమ లేదంటూ..
ఈ మేరకు మల్లన్న సాగర్ బాధితులకు (Mallanna Sagar Victims) న్యాయం జరగాలని, కాబట్టి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ (KCR) ఎక్కడ ఉన్నా.. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ కోసం పని చేశారని, ఇప్పుడు పదవి, అధికారం లేదనే కారణంతో తమ ను పట్టించుకోవట్లేదని వాపోయారు. ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గజ్వేల్‌ రావడానికి ఏమైందంటూ ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలపైన ప్రేమ లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిపించిన కూడా ప్రజలపై కనీస కనికరం లేదా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో అనేక సమస్యలు ఉన్నాయని, గజ్వేల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైన కేసీఆర్ ఎక్కడ ఉన్న గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు.

అలాగే అతికించిన పోస్టర్లలో.. పూర్తి పేరు.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వయస్సు 70 ఏళ్లు. వృత్తి.. అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయడం. అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం. భాద్యత.. గజ్వేల్ ఎమ్మెల్యే. మాజీ సీఎం. గుర్తులు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ లేదా తెల్ల లుంగి, నెత్తిమీద టోపీ, అర్హతలు.. భయంకరమైన హిందువు, 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి.. కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇస్తామని పోస్టర్లలో రాసిపెట్టారు.

Also Read: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు