KCR: ఓటమి తరువాత కేసీఆర్.. ఏం చేశారంటే?

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు అనేదానిపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది.

New Update
Mallareddy: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!

BRS Lost In Telangana Elections: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయింది. మూడోసారి కూడా కేసీఆర్ (KCR) సీఎం అయ్యి హ్యాట్రిక్ కొడుతారని బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నారు.. కానీ ప్రజలు మాత్రం ఈసారి కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి హస్తం గుర్తును తమ పాలకులు లాగా ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు.. మరోవైపు గజ్వేల్ లో తన ప్రత్యర్థులపై విజయం సాధించారు.

publive-image

ALSO READ: BREAKING: గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి!

publive-imagepublive-imagepublive-image

బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోవడంతో తమ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదం తెలిపారు. కేసీఆర్ ప్రగతిభవన్ (Pragathi Bhavan)ను కాళీ చేసి గజ్వేల్ లోని ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కేసీఆర్ ఓటమి తరువాత ఏం చేస్తున్నారనే దానిపై చర్చ జరుగుతుంది.

ఈరోజు తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు మాజీ మంత్రులు ఇతర నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేసీఆర్ ఫొటోలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు