/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Revanth-reddy-KCR.jpg)
KCR To Attend Assembly Sessions: కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా? అవ్వరా?.. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణలో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ అసెంబ్లీకి రారని.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ కు వెళ్లాలన్నది ఆయన ఆలోచన అన్న చర్చ కూడా కొన్నాళ్ల పాటు సాగింది. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడం.. కేసీఆర్ పోటీ చేయకపోవడంతో ఆ చర్చకు తెరపడింది. తాను అసెంబ్లీకి వెళ్తానని కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రకటించారు. దీంతో ఆయన అసెంబ్లీకి హాజరు కావడం కన్ఫామ్ అయ్యింది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా?
తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎం హోదాలో శాసనసభకు హాజరైన కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్షనేత హోదాలో సభకు రానున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు అసెంబ్లీలో ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించింది ప్రభుత్వం. కేసీఆర్ సభకు హాజరైతే.. సభలో హోరాహోరీగా చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరగనుంది.
రైతుల సమస్యలు, రుణమాఫీ, నిరుద్యోగుల ఆందోళనలు, జాబ్ క్యాలెండర్, శాంతి భద్రతలు, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత, పంటలకు బోనస్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా చెల్లింపుల్లో ఆలస్యం తదితర అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని BRS నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ అంశం, కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: TG News: కేంద్రం ఇచ్చినా రూ.850 కోట్లు ఏం చేశారు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్