KCR: పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం లేదు.. కేసీఆర్

పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సందర్భంగా వారికి దిశానిర్ధేశం చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎన్టీఆర్ లాంటి నేతకే తప్పలేదని గుర్తు చేశారు.

KCR: పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం లేదు.. కేసీఆర్
New Update

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు సెగ్మెంట్ల నేతలతో భేటీ అయిన మాజీ సీఎం.. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు సంబంధించి నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా సెగ్మెంట్ల నేతలతో సుదీర్ఘంగా చర్చించి నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌లు బరిలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

నష్టం ఏమి లేదు..

అలాగే ఈ కార్యక్రమంలో పిరాయింపు కార్యకర్తలు, నాయకుల గురించి మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం ఏమి లేదన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎన్టీఆర్ లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదని గుర్తు చేశారు. మనకు ఒడిదుడుకులు వస్తాయి. కాంగ్రెస్‌పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలిని పార్టీ నాయకులకు సూచించారు.

ఇది కూడా చదవండి : ORR Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం.. యువకుడు మృతి!

కలిసికట్టుగా పని చేయాలి..

ఇక ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలని చెప్పారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని.. కాంగ్రెస్‌ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే కాలం మనదేనని శ్రేణులకు తెలిపారు. ఈ నెల 12న కరీంనగర్‌లో ఆ తర్వాత ఖమ్మంలో భారీ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

#parliament-election #first-list #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe