KCR Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్

100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. సూర్యపేట జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

New Update
KCR  Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్

KCR Fires On Cong Govt :  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారని, పంటలు సుభిక్షంగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . కానీ కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) అధికారంలోకి వచ్చిన కొంత కాలంలో ఇంత దుర్బర పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ (BRS) సర్కార్ రైతు అనుకూల విధానాలను చేపట్టిందన్నారు. బీఆర్ఎష్ హయాంలో రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీటి సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రైతు బంధు (Rythu Bandhu) పేరుతో పెట్టుబడిసాయం అందించామన్నారు. రెప్పపాటు కాలం కూడా పవర్ పోకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని వెల్లడించారు.

బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం అద్బుతమైన దశకు వెళ్లిదన్న గులాబీ బాస్..పండిన ప్రతి గింజనూ తమ హయాంలో కొన్నామని, ధాన్యం దిగుబడిలో పంజాబ్ ను కూడా దాటేశిందని వివరించారు. కానీ ఇంత తక్కువ సమయంలో రైతులకు ఇంత కష్టకాలం వస్తుందని తాము అనుకోలేదన్నారు. వందరోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ (KCR) ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయంటూ ప్రశ్నించారు. రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందనుకోలేదన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింతో జర్నలిస్టులు కూడా ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. వాటి ప్రాధాన్యం లేదన్నారు. దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉణ్న రాష్ట్రం తక్కువ కాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు రావాలని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: గులాబీ బాస్ మాట్లాడుతుంటే పవర్ కట్..కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కేసీఆర్.!

Advertisment
తాజా కథనాలు