KCR: నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్

తెలంగాణలో వాళ్ళకు దిక్కు లేదు కానీ మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసిందని... కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.

New Update
KCR: నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్

''తెలంగాణ కోసం 24 ఏళ్ళ క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే ఇన్నాళ్ళు విజయం సాధించాను. కొడంగల్ రా.. గాంధీ భవన్ కు రా అని కొందరు సవాలు విసురుతున్నారు. కర్ణాటకలో 5 గంటలకు కరెంట్ కూడా కాంగ్రెస్ ఇవ్వడం లేదు. ఇప్పుడేమో ఇలాంటి సవాళ్ళు విసురుతున్నారు. తమకు దిక్కు లేకపోయినా మనకు నీతులు చెబుతున్నారు..'' అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా దమ్మేంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ళ దగ్గర ఉన్నారో తెలియదా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

Also read:ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ అశోక్ గహ్లోట్‌

ఈరోజు దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశానికే దిక్సూచిలా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్రం కోసం తాను చేయాల్సింది అయిపోయిందని.. ఇక చేయాల్సింది ప్రజలేనని అన్నారు కేసీఆర్. 60 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణలో ఈరోజు 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. రైతు బంధును 16 వేలకు పెంచామన్నారు.

పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో వారినే ప్రజలు గెలిపించాలని కోరారు. ఉన్న తెలంగాణ పోగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 2004లో ఇస్తామని చెప్పి 2014లో తెలంగాణ ఇచ్చిందన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టుకుని తెలంగాణ సాధించానని కేసీఆర్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు