BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 13 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇంకా భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ పెండింగ్ లో ఉన్నాయి.

New Update
BRS Party In AP: ఏపీలో బీఆర్ఎస్ పోటీ?.. బీఫామ్ ఇవ్వాలంటూ కేసీఆర్ వద్దకు నేత

BRS MP Candidates: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఊహించినట్లు గానే నాగర్ కర్నూల్ (Nagarkurnool) స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పేరును ఖరారు చేశారు. మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి (Venkatarami Reddy) పేరును ప్రకటించారు. మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు ఫైనల్ అయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అనూహ్యంగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్ గా సుధీర్ఘ కాలం పాటు పని చేశారు. అనంతరం రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది బీఆర్ఎస్. ఇప్పుడు మెదక్ (Medak) నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం: GHMC మేయర్ విజయలక్ష్మి సంచలన ప్రకటన!

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. తొలుత బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. పొత్తులో భాగంగా తాను నాగర్ కర్నూల్ నుంచి, మరో అభ్యర్థి హైదరాబాద్ సీటు నుంచి పోటీలో ఉంటుందన్నారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. తమ పొత్తును భగ్నం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని.. ఈ నేపథ్యంలోనే తాను బీఎస్పీని వీడుతున్నట్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయనకు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ టికెట్ దక్కింది.

దీంతో ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరో వారంలో ఆ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు