Kishan Reddy: కేసీఆర్‌ తన ఓటమిని అంగీకరించారు

సీఎం కేసీఆర్‌ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని స్పష్టం చేశారు.

Kishan Reddy: కేసీఆర్‌  తన ఓటమిని అంగీకరించారు
New Update

సీఎం కేసీఆర్‌ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ విడుదల చేసిన అభ్యర్థుల లీస్ట్‌ చూస్తేనే ఇది అర్థమవుతోందన్నారు. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు సైతం అర్ధమైనట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్ గజ్వేల్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు బీజేపీకి అన్ని వర్గాల్లో పెరుగుతున్న గ్రాఫ్‌ను చూసి భయడుతున్నారని ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దొంగ దీక్షలు చేసిన కేసీఆర్‌.. తెలంగాణలో మహిళలను రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేసే ముందు.. కేసీఆర్‌ తాను మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడాలన్నారు. సీఎం కేసీఆర్‌ మజ్లిస్‌తో కలిసి పోటీ చేయాడంపై కిషన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద మజ్లిస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ ప్రాంతాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయన్న ఆయన.. మజ్లిస్‌తో కలిసి పోటీచేసి 29 స్థానాల్లో గెలుపొందిలని చూస్తున్నారన్నారు.

కేసీఆర్‌ మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాల్లో అవినీతికి పాల్పడ్డ వారికే మళ్లీ సీట్లు ఇవ్వడంతో సీఎం రాష్ట్రంలో అవినీతికి పచ్చజెండా ఊపినట్లైందని విమర్శించారు. నిజాయతీగా ప్రయత్నిస్తే గెలవబోమని ఆలోచించిన కేసీఆర్‌.. అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలుపుకోసం ప్రయత్నించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు.

#bjp #brs #kcr #otami #kishan-reddy #list-of-mlas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe