Sleeping Village: ఈ ఊర్లో అందరూ కుంభకర్ణులే..పడుకుంటే నెల రోజులు లేవరు!

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామంలో ప్రతి వ్యక్తి కనీసం ఒక నెలపాటు నిద్రపోతాడు. ఒక్కసారి నిద్రపోయారంటే ఎంత ప్రయత్నించినా వారిని లేపడం కష్టమే. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం గ్రామంలోని కలుషిత నీరు అని చెబుతున్నారు.

New Update
Sleeping Village: ఈ ఊర్లో అందరూ కుంభకర్ణులే..పడుకుంటే నెల రోజులు లేవరు!

మన జీవితంలో ప్రతి ఒక్కరూ 7-8 గంటల నిద్రను పొందడం చాలా ముఖ్యం. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం రోజుకు నాలుగైదు గంటలు పడుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే ఏకంగా 8 గంటలకు ఎక్కువగానే నిద్రిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో ప్రజలు మాత్రం పడుకున్నారంటే నెల రోజుల వరకు కూడా నిద్రలేవరు. డీజే శబ్ధాలు కూడా వారిని నిద్రలేపలేవు. నెలరోజుల పాటు వారికి డబ్బులు లేకపోయినా రోజు గడుస్తుంది.

DJ ప్లే చేసినా నిద్రలేవరు
కజకిస్తాన్‌లో ఒక గ్రామం ఉంది. ఇక్కడ ప్రజలు చాలా నెలల తరబడి నిద్రపోతారు. ఈ గ్రామం పేరు కలాచి. ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి కనీసం ఒక నెలపాటు నిద్రపోతాడు. ఈ ప్రత్యేకమైన గ్రామాన్ని నీందారి హాలో అని కూడా పిలుస్తారు. ఒక్కసారి నిద్రపోయారంటే ఎంత ప్రయత్నించినా వారిని లేపడం కష్టమే. బాంబులు పేలినా, పెద్ద పెద్ద డీజే శబ్ధాలు పెట్టినా మేల్కొల్పడం కష్టమే.

ఎందుకు అలా జరుగుతోంది?
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం గ్రామంలోని కలుషిత నీరు అని చెబుతున్నారు. వివిధ పరీక్షలు చేసిన తర్వాత ఆ గ్రామంలోని నీటిలో కార్బన్ మోనాక్సైడ్ ఉందని, ఇది గ్రామం సమీపంలో నిర్మించిన యురేనియం గని నుండి వచ్చినట్లు పరిశోధకలు అంటున్నారు. కలాచి ప్రజలు చాలా నెలలు నిద్రపోవడానికి కారణం ఇదే అని చెబుతున్నారు. ఈ గ్రామంలోని ప్రజలంతా నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో పడుకుంటే నెలల తరబడి అక్కడే అలా పడుకుని ఉండిపోతాడని గ్రామస్తులు చెబుతున్నారు.

పడుకున్న విషయం వారికే తెలియదు
కజకిస్థాన్‌లోని కలాచి గ్రామానికి చెందిన కొంతమంది చెబుతున్నది ఏంటంటే నిద్ర నుండి లేచిన తర్వాత వారు ఎంత సేపు పడుకున్నారో, ఎక్కడ ఎలా నిద్రించారో కూడా తెలియదని అంటున్నారు. పడుకునే సమయంలో స్పృహ కూడా కోల్పోతారని, ఏదో ప్రపంచానికి వెళ్లిపోతామని గ్రామస్తులు అంటున్నారు.

Also Read: ఫిల్టర్‌ కాఫీ..మామూలు కాఫీ మధ్య తేడా ఏంటి?

Advertisment
తాజా కథనాలు