Supreme Court: రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కు తీసుకున్నారు. ఆల్రెడీ ఈడీ అరెస్టు చేయడంతో దీనిపై విచారణ అవసరం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Supreme Court: రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
New Update

Delhi Liqour scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్​ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని...ఈ విషయలంఓ ఈడీని ఆదేశించాలంటూ కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

ఏడాదిగా వాయిదాలు...
చివరకు కవిత దాఖలు చేసిన పిటిషన్‌ మీద మార్చి 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. ఆరోజు కూడా వాయిదా పడి.. చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్​ మీద విచారణ జరిగింది. అయితే అప్పటికే ఈ రిట్​ పిటిషన్ మీద అప్పటికే ఈడీ కెవియట్​ పిటిషన్​ దాఖలు చేయడంతో రెండింటినీ కలిపి ఒకేసారి విచారించింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఈ పిటిషన్ మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈ వ్యాజ్యం​ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్​ ను ఈ నెల 15న మరోమారు విచారించిన సుప్రీం, ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల తర్వాత ఈరోజుకి వాయిదా వేసింది. అయితే అదే రోజున కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఇక విచారణ అవసరం లేదని కవిత తరుఫు న్యాయవాదులు పిటిసన్‌ను వెనక్కు తీసుకున్నారు.

Also Read:సీఏఏ అమలుకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్ మీద కేంద్రం స్పందించాలి-సుప్రీంకోర్టు

#kavitha #supreme-court #writ-petition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe