మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవితకు పోచారం గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి మల్లారెడ్డి బోనాలతో ఎదురెల్లి ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలకగా.. అనంతరం మల్లారెడ్డి కవితకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హెలికాఫ్టర్ ద్వారా కవితపై పూల వర్షం కురిపించారు. అనంతరం కవిత బంగారు బోనం మోస్తూ మహిళలతో కలిసి గుడి వద్దకు చేరుకున్నారు.
గుడి వద్దకు చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కల్వకుంట్ల కవిత తెచ్చిన బాంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించిన పూజారులు ఆమెను ఆశీర్వదించారు. కాగా కవితకు హైలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏర్పటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. ప్రజలందరూ పాడి పంటలతో, ఇంట్లో ధాన్యం సిరులతో బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కాగా మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.
రానున్న ఎన్నికల్లో సైతం మల్లారెడ్డి విజయం సాధిస్తే ఇక్కడి అన్ని సమస్యలు తీరుతాయని ఆమె తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్కూళ్లు నిర్మించారని. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలను సైతం నిర్మించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు మల్లారెడ్డికి మరోసారి ఓటు వేయాలని కోరారు.