Kavitha: మేడిగడ్డపై విచారణ.. కవిత ఏమన్నారంటే..!

మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. అలాగే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ఆమె అభ్యంతరం తెలిపారు.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై స్పందించారు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగిందని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని ఆమె అన్నారు. రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారని ఫైర్ అయ్యారు.

ALSO READ: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ

అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కవిత అన్నారు. ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పు గౌరవిస్తున్నామని తెలిపారు. ఎన్నికల తరువాత తొలి శాసనమండలి సమావేశాలు ఇవి ఆమె అన్నారు. మండలిలో బీఆర్ఎస్ కు మెజారిటీ ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్ ప్రజలకు చెప్పాలని తెలిపారు. నష్టం జరిగే చర్యలు అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తామని వెల్లడించారు.

ALSO READ: కేసీఆర్‌ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్

మేడిగడ్డపై విచారణ.. కవిత ఏమన్నారంటే..!

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram) ప్రాజెక్ట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటామని అన్నారు. ఇందుకోసం స్పెషల్ కమిటీ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సభ్యులందరికి ప్రాజెక్ట్ వద్దకు పర్యటనకు తీసుకు పోతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అదేమైనా పర్యాటక కేంద్రమా? అందరిని తీసుకెళ్లడానికి అని ఆమె రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సెటైర్లు వేశారు.

Advertisment
తాజా కథనాలు