Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని, రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రమంటూ సెటైర్ వేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరంటూ ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.

New Update
Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రమని సెటైర్ విసిరారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని.. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎవరు బాగుపడరు..
రేవంత్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. ఒక అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారన్నారు. జీవో 3 నిజమైతే 30వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్ఫ్యూజ్‌లో ఉన్నారన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరని.. తమ పోరాటం మహిళలకే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదన్నారు. హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Murdoch: 93 ఏళ్ల వయసులో ప్రేమ.. ఐదో పెళ్లికి సిద్ధమైన వృద్ధ జంట!

సుప్రీం కోర్టుకైన వెళ్లాలంటూ..
తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖలో కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, జీవో 3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.జీవో 3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు అన్యాయం జరిగే ఈ జీవోపై అవసరం అయితే సుప్రీం కోర్టుకైన వెళ్ళాలని కవిత పిలుపుపిచ్చారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ మారుతోందన్నారు. పీజీటీ , జెఎల్ పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలను కలవటం లేదని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రజలకు కనపడటం లేదని ప్రశ్నించారు. ఆయన ఢిల్లీ నేతలనే కలుస్తారని.. ఇక్కడ ప్రజలను కలవరని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు