BREAKING: కాంగ్రెస్ కు కత్తి కార్తీక రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. కాంగ్రెస్ దుబ్బాక టికెట్ తనకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

New Update
BREAKING: కాంగ్రెస్ కు కత్తి కార్తీక రాజీనామా

Kathi Karthika Resigned To Congress: తెలంగాణలో రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఈరోజు కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి దుబ్బాక టికెట్ ను ఆశించారు కత్తి కార్తీక. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసంతృప్తి ఉన్న ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ALSO READ: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ..

గతంలో బీజేపీలో పార్టీలో ఉన్న కత్తి కార్తీక ఆ పార్టీకి రాజీనామా చేసి 2021లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 'భారత్ జోడో యాత్ర' లో కత్తి కార్తీక కీలకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మిర్ వరకు పాదయాత్ర చేశారు కత్తి కార్తీక.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు