BREAKING NEWS: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది.

New Update
BREAKING NEWS: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు కాటలిన్‌ కరికో (Katelyn Kariko), డ్రూ వెయిస్‌మన్‌ (Drew Weissman)ను అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం (Nobel Prize)-2023 వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA vaccines) అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరించినదుకు ఈ ఇద్దరి ఈ అవార్డును ఇచ్చారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ (Karolinska Institute)లోని నోబెల్‌ కమిటీ ఈ మేరకు (అక్టోబర్ 2న సోమవారం) వెల్లడించింది.

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారం రోజులు సాగనున్నది. ఈనెల 6వ తేదీ (శుక్రవారం) రోజున-2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ నోబెల్‌ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ సంవత్సరం పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నగదు అందజేశారు. కాగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లకు(Swedish kroner) పెంచారు. స్వీడిష్‌ కరెన్సీ విలువ పడిపోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్‌10న (ఆదివారం) గ్రహీతలకు అందజేయనున్నారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరు ఉంది. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు (Alfred Nobel name) మీదుగా ప్రపంచం (world)లో వివిధ రంగాల్లో ఆయన విశేష సేవలందించారు. ఈ క్రమంలో వారికి ఈ అవార్డును ప్రదానం (Award presentation) చేస్తున్నారు. అయితే..1896లో ఆల్‌ఫ్రెడ్‌ (Alfred) నోబెల్‌ మరణించారు. ఆయన ట్రస్ట్ ద్వారా 1901 నుంచి ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. గతేడాది మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు (hominin genes) సంబంధించిన ఆవిష్కరణలకు స్వాంటె పాబో (Svante Pabo) ఈ అవార్డును అందుకుంది.

కోట్లాది మంది ప్రాణాలకు...

యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో హంగేరీకి చెందిన కాటలిన్‌ కరికో.. అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌ కలిసి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపించారు. అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచాయని వారి పరిశోధనలో గుర్తించారు. దీనిపై 2005లో పబ్లిష్ చేసినా.. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందలేదు. తర్వాత కొవిడ్‌ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించారు. వీరి పరిశోధనల వల్ల 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తాయని తెలపగా.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడవచ్చని నోబెల్‌ బృందం పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు