హిందూ పురాణాల్లో కార్తీక మాసానికి (Karthika masam) ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ మాసం గొప్పతనాన్ని అర్థం చేసుకొని నడుచుకుంటే జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెలని ఉపవాస మాసం అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటికే కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. వచ్చే నెల 13తో ఈ కార్తీక మాసం ముగుస్తుంది.
ఈ మాసంలో శివకేశవుల్ని పూజించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ కార్తీకంలో సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానాలు చేసి దీపారాధన చేస్తే ఆరోగ్యం, విజయం , ఐశ్వర్యం చేకూరతాయని భక్తులు విశ్వాసిస్తారు. అలాగే ఈ పవిత్ర మాసంలో చేసే కొన్ని విశేషమైన పూజల వల్ల జీవితంలో అనేక సమస్యలు పరిష్కరమవుతాయి కూడా.
పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి వివాహం ఆలస్యం అవుతుంటే కనుక ఏ మాసంలో కొన్ని విశేషమైన పూజలు చేయడం వల్ల వివాహం తొందరగా అవ్వడమే కాకుండా వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు తొందరగా వివాహం చేసుకోవాలి అంటే కనుక తెల్లవారుజామున లేచి తులసి కోట ముందు పూజ చేయాలి.
ఇలా చేయడం వల్ల వివాహం తొందరగా జరగడమే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. ఇంకా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఎంత ప్రయత్నించినా అవి పరిష్కారం కావు అనుకుంటే..నదికి సమీపంలోని ఆలయంలో దీపారాధన, హోమం, అభిషేకం, సామూహిక కుంకుమార్చనలు చేయాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ నెల మొత్తం శివారాధన చేయడంతో పాటు ఉపవాసం చేస్తే శివ కటాక్షం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీక పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే కోరుకున్న భాగస్వామి లభించడంతో పాటు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగుతుందని కూడా నమ్ముతారు.
ఈ మాసంలో సూర్యచంద్రుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఈ మాసం అంతా సూర్యచంద్రులను పూజించి తగిన పరిహారం చేసుకోవడం మంచిది.
Also read: ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే!