Teacher, student romantic photo shoot:కర్ణాటక రొమాంటిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్

స్టూడెంట్‌తో రొమాన్స్ చేస్తూ ఫోటో షూట్ చేయించుకున్న కర్ణాటక రొమాంటిక్ ప్రిన్సిపాల్ తిక్క కుదిర్చారు అధికారులు. ప్రిన్సిపల్, స్టూడెంట్ ఫోటోలు వైరల్ ఆవడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. మిస్ కండక్ట్ కంప్లైంట్‌తో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.

New Update
Viral Photo shoot:బాబోయ్ ఇదేం చోద్యం..టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్‌ వైరల్

High school principal:కర్ణాటకలోని మురుగమిల్లి హైస్కూల్ ప్రిన్సిపల్ పుష్పలత, అదే స్కూల్‌లో చదువుతన్న పదవ తరగతి పిల్లాడి రొమాంటిక్ ఫోటో షూట్ వ్యవహారం తెగ వైరల్ అయింది. వీళ్ళిద్దరి ఇంటిమేట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మురుగుమల్లలో పదవ తరగతి చదువుతన్న కుర్రాడిని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఎడ్యుకేషనల్ టూర్ అని చెప్పి బయటకు తీసుకెళ్ళారు. అసలు అలా ఒక్క స్టూడెంట్‌ను తీసుకెళ్ళడమే పెద్ద వింతైన విషయం. తీరా వెళ్ళాక వాళ్ళు చేసిన పని మరీ విడ్డూరంగా అనిపించింది. టూర్‌కు వెళ్ళాక వాళ్‌ళిద్దరూ ఒక ఫోటో షూట్ చేసుకున్నారు. అందులో కుర్రాడు టీచర్ ను ఎత్తుకోవడం, ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం లాంటి ఫోటోలు ఉన్నాయి. దానికి తోడు వాళ్ళిద్దరూ వేసుకున్న బట్టలు కూడా అనుమానానికి తావు తీస్తున్నాయి. ఇద్దరూ కుర్తా, చీరల్లో సంప్రదాయ బట్టల్లో ఉన్నారు. దీంతో వాళ్ళిద్దరూ ఏమైనా పెళ్ళి చేసుకున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ ఫోటోలను బట్టి ప్రిన్సిపల్, స్టూడెంట్‌లకు ఇంతకు ముందు నుంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది.

Also read:భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

అయితే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్‌ పుష్పలతను తన విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. మిస్ కండక్ట్ కంప్లైంట్ కింద యాక్షన్ తీసుకున్నారు. ఫోటో షూట్ పిక్స్ వేరల్ కావడంతో వాటి మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి. కుర్రాడి తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు