Karnataka Minister Row: అయోధ్య రామమందిరంపై కర్ణాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. అయోధ్య రామాలయంపై కర్ణాటక మంత్రి కేఎస్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు ఓ డేరా వేసి అందులో రెండు బొమ్మలు పెట్టి రాముడు అన్నారని చెప్పారు. రాముడి గుడికి వెళ్తే అనుభూతి వస్తుంది అయోధ్యలో నాకు అలాంటిది అనిపించలేదన్నారు. By B Aravind 17 Jan 2024 in Uncategorized New Update షేర్ చేయండి యూపీలోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామనిపై కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ' బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు నేను ఆ చోటుకి వెళ్లాను. అక్కడ రెండు బొమ్మలు ఉంచారు. డేరా వేసి దాన్ని రాముడు అని పిలిచారు. దేశంలో వెయ్యేళ్ల చరిత్ర గలిగిన రామ మందిరాలున్నాయి. రాముని గుడికి వెళ్తే ఓ అనుభూతి ఉంటుంది. Also Read: మహువా మొయిత్రాకు మరో షాక్.. బంగ్లా ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులు.. అయోధ్యలో నాకు అలాంటి అనుభూతి ఏమీ అనిపించలేదు. అది టూరింగ్ టాకీస్‌లో బొమ్మల వలె ఉంది. బీజేపీ రామమందిరం నిర్మాణంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని' కేఎన్ రాజన్న అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆ తర్వాత రాజన్న తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'అప్పుడు డేరాలో ఉంచారు కాబట్టి మీ అందరితో అలా చెప్పాను.. ఇప్పుడు అక్కడ ఏముందో నేను చూడలేదు. ఓసారి వెళ్లి చూసి ఏముందో చెబుతానని ' అన్నారు. ఇదిలాఉండగా.. రాజన్న చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిరం ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు నిరాశా, నిస్పృహల కారణంగానే ఇలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తమ అహంకారం వల్లే రామమందిరాన్ని సందర్శించేందుకు నిరాకరించారంటూ విమర్శించారు. రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని, విపక్ష నేతలను కూడా ఆహ్వానించారని.. ఈ కార్యక్రమానికి వస్తే ఇది అందరి కార్యక్రమం అవుతుందని అలోక్ అన్నారు. Also Read: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు #telugu-news #karnataka-mp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి