Karnataka Power Supply: కర్ణాటకలో రైతులకు ఇవ్వడానికి కరెంటే లేదంటూ ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ అన్నారు. కర్ణాటకలో విద్యుత్ సరఫరాపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఏంటా? అని ఆరా తీసే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఈ క్రమంలోనే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్‌ను వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కీలక విషయాలు వెల్లడించారు. కర్ణాటకలో రైతులకు ఇవ్వడానికి కరెంటే లేదన్నారు. 17వేల మిలియన్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తులే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోదని క్లారిటీ ఇచ్చారు మంత్రి.
Also Read:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…
అయితే, ఈ విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు మంత్రి జార్జ్. విద్యుత్ కొనుగోలు అంశంపై సోమవారం నాడు సీఎం సిద్ధరామయ్యతో సమావేశం ఉందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కొరత కారణంగా రైతలుకు వన్ ఫేజ్, టూ ఫేజ్, త్రి ఫేజ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని కర్ణాకట మంత్రి వివరించారు.
ఇదే సమయంలో తెలంగాణలో కర్ణాటక రైతుల ఆందోళనలపై మంత్రి జార్జ్ విమర్శలు చేశారు. అదో రాజకీయ నాకటం అని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్లే డబ్బులిచ్చి తెలంగాణలో ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు మంత్రి జార్జ్. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? లేదా? అనేది అక్కడి ఓటర్లు డిసైడ్ చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే అనే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు మంత్రి జార్జ్.
Also Read: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక