Crime News : 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో బాలిక ఆత్మహత్య!

కర్నాటక మాండ్యాలో లైంగిక వేధింపులకు గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని గర్భవతి అని తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిందని మాండ్య ఎస్పీ ఎన్ యతీష్ తెలిపారు. పొరుగింటి వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం.

New Update
Crime News : 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో బాలిక ఆత్మహత్య!

Karnataka Mandya News : కర్ణాటక(Karnataka) లోని మాండ్య జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు గురైన 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై అత్యాచారం జరిగిందని సమాచారం. అత్యాచారం తర్వాత గర్భం దాల్చిందని స్థానికులు చెబుతున్నారు. గర్భవతి(Pregnant) అని తెలియగానే ఆత్మహత్య(Suicide) కు పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మైనర్ అని, వయసు 15 ఏళ్లు మాత్రమేనని మండ్య ఎస్పీ ఎన్.యతీష్ తెలిపారు. విద్యార్థిని మృతదేహం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం తర్వాత ఆమె షాక్‌కు గురైందని, ఈ సమయంలో ఆమె గర్భవతి అని తెలియగానే ఒత్తిడి పెరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే ఘోరం జరిగిపోయింది:
పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాలిక చాలా బాధగా కనిపించింది. అయితే ఆమె తన ప్రాణాలను తీసుకుంటుందని కుటుంబ సభ్యులకు ఊహించలేకపోయారు. సరిగ్గా భోజనం కూడా చేయలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తన గదిలో పడుకోవడానికి వెళ్ళింది. ఉదయం ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూశారు. విద్యార్థి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది.

గాలింపు చర్యలు:
పొరుగింటి వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అత్యాచారం తర్వాత ఆ అబ్బాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి మొబైల్‌పై నిఘా పెట్టారు.

Also Read: ‘సిద్ధం’లో మోగనున్న జగన్‌ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు