SI Jobs: ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ పరీక్ష! కర్ణాటకలో 545 ఎస్సై పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో అక్కడి హైకోర్టు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కొందరు అభ్యర్థులు కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. By B Aravind 12 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కర్ణాటకలోని సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల వేళ భారీగా అక్రమాలకు పాల్పడిన వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు మార్గం సుగమమయింది. అక్కడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 545 ఎస్‌ఐ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా కలబురిగి కేంద్రంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు బ్లూటూత్‌లు వాడటం, ఆన్సర్‌షీట్ల దిద్దుబాట్లపై జరిగిన అక్రమాలు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ కేసులో పరీక్షల నిర్వహణాధికారిగా వ్యవహరించిన ఐజీ స్థాయి పోలీసు అధికారి అరెస్టయ్యారు. సీఐడీ దర్యాప్తులో కూడా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: కీచక టీచర్లు.. స్కూల్ టాయిలెట్‌లో 6వ తరగతి బాలికను ఏం చేశారంటే? పరీక్షల్లో అక్రమాలు జరగడంతో 545 ఎస్‌ఐ పోస్టులకు మళ్లీ పరీక్షలు పెట్టాలని 2022 ఏప్రిల్ 29న అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు తాము నిజాయితీగా పరీక్షలు రాశామని, మరోసారి రాయలేమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించాలని తొలుత కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కానీ ట్రిబ్యునల్ ప్రభుత్వ ఆదేశాలను సమర్థించింది. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వెంటనే పరీక్షలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఇప్పటికే పదుల సంఖ్యలో అభ్యర్థులు, సూత్రధారులు, పోలీసు అధికారులు అరెస్టయ్యారని.. ఇప్పుడు ఈ పరీక్షల ఆధారంగా నియామకాలు జరపడం అసాధ్యమని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టి వేసింది. దీంతో మళ్లీ 545 ఎస్సై పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిండం తప్పనిసరి అయిపోయింది. Also Read: పది అర్హతతో ఇస్రోలో జాబ్స్…జీతం రూ. 60వేల పైనే…పూర్తివివరాలివే..!! #telugu-news #police #si #police-job మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి