Dog Meat: అవి మేకలే.. కుక్క మాంసం ఎసిసోడ్‌లో కీలక మలుపు!

కర్ణాటకలో మటన్‌ పేరుతో అమ్ముతున్నది కుక్క మాంసం కాదని తేలింది. అది సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని పోలీసులు నిర్ధారించారు. దీంతో సిరోహి జాతి మేక గురించి నెట్టింట తెగ చర్చ మొదలైంది. దాని ప్రత్యేకతలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.

New Update
Dog Meat: అవి మేకలే.. కుక్క మాంసం ఎసిసోడ్‌లో కీలక మలుపు!

Karnataka: అది మేకా? కుక్కా? ఇప్పుడిదే ప్రశ్న ఎంతోమందిని వేధిస్తోంది..! కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిజానికి కుక్క మాంసం తినే రాష్ట్రాలు, చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ కర్ణాటకలో మాత్రం మటన్‌ పేరుతో కుక్క మాంసాన్ని అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది. పోలీసులు పట్టుకున్న మీట్‌ కూడా కుక్కదేనని వార్తలు వచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ DK శివ కుమార్, సీఎం సిద్ద రామయ్య ఆప్తుడు అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే బెంగుళూరులో మాంసం దందా కొనసాగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ కుక్క మాంసం ఎసిసోడ్‌ మలుపు తిరిగింది.

సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం..
రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని పోలీసులు నిర్ధారించారు. ప్రచారం జరిగినట్టుగా అది కుక్క మాంసం కాదని తేల్చారు. దీంతో కర్ణాటక పోలీసులు చెప్పిన సిరోహి జాతి మేకపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కుక్క లాగ కనిపించే ఈ మేక గురించి నెట్టింట తెగ సేర్చ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!

సిరోహి అనేది రాజస్థాన్ జిల్లా పేరు. అందుకే అక్కడ నివాసముండే మేకల ప్రత్యేక జాతిని సిరోహి మేకలగా పిలుస్తారు. ఈ ప్రత్యేక జాతి మేకల పాలు, మాంసం దేశంలోని చాలా రాష్ట్రాలకు రవాణ అవుతుంది. సిరోహి జాతి మేక రోజుకు 750 గ్రాముల నుంచి ఒక లీటరు వరకు పాలు ఇస్తుంది. ఈ జాతి మేకల బరువు 50 నుంచి 60 కిలోల వరకు ఉంటుంది. దేశంలో ఉన్న 37 రకాల మేకల్లో ఈ జాతి పెంపకానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే దేశంలో మాంసంతో పాటు ఈ మేక పాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ లోనే ఎక్కువగా..
రాజస్థాన్‌తో పాటు, సిరోహి జాతి మేకలు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో కూడా కనిపిస్తాయి. ఇక దీని శరీర రంగు గోధుమ రంగులో ఉంటుంది. శరీరంపై లేత లేదా గోధుమ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. దాని చెవులు వేలాడుతూ ఉంటాయి. కొమ్ములు వంగి ఉంటాయి. జుట్టు పొట్టిగా, మందంగా ఉంటుంది. మగ సిరోహి శరీర పొడవు సుమారు 80 సెంటిమీటర్లు. ఆడ సిరోహి పొడవు సుమారు 62 సెంటిమీటర్లు ఉంటుంది.

ఈ జాతి మేకలు ఎక్కువగా వెల్లుల్లిని మేతగా తింటాయి. అటు పప్పుధాన్యాల ఆహారాన్ని కూడా తినేందుకు ఇష్టపడతాయి. పశుగ్రాసం కూడా లాగిస్తుంది. ఇది సిరోహి మేకలకు శక్తిని , అధిక ప్రొటీన్లను అందిస్తుంది. ఈ జాతికి ఆహారం ఉన్న ప్రదేశంలో మూత్ర విసర్జన చేసే అలవాటు కూడా ఉంది. అలా కొన్ని సార్లు తమ ఆహారాన్ని వాటికి అవే పాడుచేసుకుంటాయి.

విన్నారుగా ఈ సిరోహి జాతి మేకల గురించి.. అదండి విషయం.. ఇవి కుక్కలు కాదు.. మేకలే..! కర్ణాటకకు రవాణ అయ్యింది కూడా ఈ మేకలే..! నిజానికి సౌతిండియాలో చాలా మందికి ఈ తరహా మేకల గురించి అవగాహన తక్కువ. మన మేకలకు, ఈ మేకకు చాలా తేడా ఉంటుంది. ఇవి చాలా ఎత్తుగా కూడా కనిపిస్తాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే దీనికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు