Bharath Reddy: కర్ణాటక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి ( Bharath Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఆస్తులపై శనివారం దాడులు నిర్వహించింది. బళ్లారి, బెంగళూరులోని ఎమ్మెల్యే నివాసాలు, చెన్నైలోని ఓ కార్యాలయం, ఆయన తండ్రి కార్యాలయం, ఆయన మామ ప్రతా రెడ్డి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిగాయి. అలాగే ఆయన బంధువులకు చెందిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఆరు రాష్ట్రాల్లో దాడులు..
ఈ మేరకు మనీలాండరింగ్(money-laundering) కేసులో భాగంగా బెంగళూరు నుంచి బళ్లారికి ఉదయం 6:30 గంటలకు చేరకున్న ఈడీ.. నారా భరత్ రెడ్డి నివాసంపై దాడులు ప్రారంభించింది. కర్ణాటకతోపాటు ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో శనివారం ఈడీ ఈ దాడులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎమ్మెల్యే కుటుంబానికి కొప్పల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో గ్రానైట్ క్వారీ వ్యాపారాలు ఉన్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డిపై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి : Telangana: బీఆర్ఎస్ ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రెషర్ కుక్కర్ల పంపిణీ..
గతంలో ఎమ్మెల్యే తన జన్మదినోత్సవం సందర్భంగా బళ్లారి నగర వ్యాప్తంగా ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేయడం గమనార్హం. కాగా ఆయనకు సంబంధించిన భూ ఒప్పందాలల్లో అవకతవకలు జరిగాయని నిరూపించడానికి తగిన ఆధారాలు ప్రస్తుతం ఈడీ వద్ద ఉన్నట్లు పేర్కొంది. ఆయనతో సంబంధమున్న పలు మైనింగ్, క్వారీ సంస్థలపైనా ఏజెన్సీ విచారణ జరుపుతోంది.