ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ (Bandi Sanjay) ఓటమి పాలైన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్ల తేడాతోనే ఆయన ఓడి పోయారు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు బండి సంజయ్. దీంతో ఈ సారి కూడా బండి సంజయ్ మళ్లీ ఎంపీగా బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జిల్లాలోని కొందరు సీనియర్లు మాత్రం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తుండడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరీంనగర్ కు చెందిన సీనియర్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?
రానున్న ఎంపీ ఎన్నికల్లో సంజయ్ కు బదులుగా మరో సీనియర్ నేతకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం. సంజయ్ తీరుతో కరీంనగర్ లో పార్టీ బలహీనపడిందని ఆయా నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొంతమంది నేతల కారణంగానే తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని బండి సంజయ్ ఇటీవల వెల్లడించారు. ఎంపీ ఎన్నికల ముందు నేతల తీరుతో అధిష్టానం తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Parliament Attack : పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి?
సీనియర్ల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, సీనియర్ నేత సుగుణకర్ రావు తదితరులు హాజరైనట్లు సమాచారం. అయితే.. బండి సంజయ్ కు టికెట్ నిరాకరిస్తే మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ కే టికెట్ దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్, గజ్వేల్ రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.