Mudragada May Join in YCP: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడను (Mudragada Padmanabham) వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ముద్రగడ పద్మనాభం వస్తారన్న చర్చ సాగుతోంది. ముద్రగడ కొడుకు చల్లారావు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాకినాడ ఎంపీగానీ, పెద్దాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ముద్రగడతో ఇప్పటికే జగన్ (AP CM Jagan) సన్నిహితుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: CM Jagan: సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు..టెన్షన్ లో ఎమ్మెల్యేలు!
తనకు ఆర్థిక స్తోమత లేదని ముద్రగడ చెప్పినట్లు తెలుస్తోంది. ముద్రగడ కొడుకు పోటీపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే.. రానున్న ఎన్నికల్లో పవన్, టీడీపీ పొత్తు (TDP-Janasena) ఖాయమైన నేపథ్యంలో కాపు ఓటు తమ నుంచి డైవర్ట్ కాకుండా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అనేక మంది కాపు నేతలకు కూడా టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: TDP: ‘అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వను’.. కేసినేని నాని కీలక వ్యాఖ్యలు.!
ఇదిలా ఉంటే.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరో సారి గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులనే మార్చేందుకు కూడా సిద్ధం అవుతోంది. ఇప్పటికే పలు సిట్టింగ్ స్థానాల్లో కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ త్వరలో అనేక మార్పులకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది.