Kanojia Bundi Ladoo: స్వీట్‌తో చేసిన లడ్డూ అంటే అందరికి ఎంతో నచ్చుతుంది. తెలుగువారు పండగ సమయంలో ఎక్కువగా బూందీ లడ్డూ చేస్తారు. దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే లడ్డూలు మన రోజూవారి స్వీట్లు కంటే భిన్నంగా ఉంటాయి. అంతేకాదు ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. చాలామందికి లడ్దూ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దానిలో బూందీ పేరు చెప్పగానే కొందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. చాలా మంది రకరకాల లడ్డూలు తింటూ ఉంటారు. కానీ.. కనోజియా బూందీ లడ్డూల రుచి వేరుగా ఉంటుంది. ఈ లడ్డూ రుచి ఎలా ఉంటుందంటే.. దీనిని ఒక్కసారి రుచి చూస్తే..ఇతర స్వీట్ల రుచి మీకు డల్‌గా అనిపిస్తుంది.
బూందీ లడ్డూ పూర్తిగా భిన్నమైన, ప్రత్యేకమైన పద్ధతిలో..
అంతేకాదు.. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన ఈ బూందీ లడ్డూ పూర్తిగా భిన్నమైన, ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఇది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనదిగా రుజువు అయింది. అయితే.. కొందరూ నచ్చిన లడ్డూ కోసం ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకుంటారు. అలాగే.. ఈ లడ్డూలను కొనుగోలు చేసేందుకు కొందరూ ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారట. ఈ లడ్డూలలో దేశీ నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా..కన్నౌజ్ పెర్ఫ్యూమ్ కూడా ఉపయోగంచి చేస్తారు. డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఎలా తయారు చేసుకోవాలి.. దాని ఉపయోగాలు ఎంటో ఇప్పుడు కొన్ని విషాయాలు తెలుసుకుందాం.
లడ్డూ తయారీ విధానం
కనోజియా బూందీ లడ్డూలలో కూడా పరిమళం యొక్క సువాసన అనుభూతి చెందుతుంది. దీన్ని తయారు చేయడానికి.. రోజ్ వాటర్, కేవ్రా, కుంకుమపువ్వు పరిమళాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ముందుగా స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఉపయోగిస్తారు. బూందీ నెయ్యిలో సాదా శనగ పిండిని వేసి తయారు చేస్తారు. అప్పుడు సిరప్ తయారు చేయబడుతుంది. డ్రై ఫ్రూట్స్‌తో బూందీ లడ్డులో జీడిపప్పు, పిస్తా, బాదం వంటి రకరకాల డ్రై ఫ్రూట్స్‌ని కలిపి ప్రత్యేక బూందీ లడ్డూను తయారు చేస్తారు. ఈ లడ్డూ తయారీలో, నీటికి బదులుగా రోజ్ వాటర్ ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన లడ్డూ పరిమాణం సాధారణ లడ్డూ కంటే పెద్దదిగా ఇది ఉంటుంది.
ఇది కూడా చదవండి: రక్తం పీల్చే కీటకాలు.. నిద్రలో పీడించుకు తింటాయ్.. చెక్ పెట్టండిలా!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.