Rishab Shetty : 'కాంతారా' హీరో ఎమోషనల్ పోస్ట్.. 24 ఏళ్ళ కల నిజమైందంటూ!

హీరో రిషబ్ శెట్టి తన అభిమాన హీరో చియాన్ విక్రమ్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ' విక్రమ్ ను కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది' అంటూ పేర్కొన్నారు.

New Update
Rishab Shetty : 'కాంతారా' హీరో ఎమోషనల్ పోస్ట్.. 24 ఏళ్ళ కల నిజమైందంటూ!

Kannada Actor Rishab Shetty : 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమోషనల్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత తన కల నిజమైందని చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు. ఈ కన్నడ హీరో ఎమోషనల్ అవ్వడానికి కారణం కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్. రిషబ్ శెట్టి తన అభిమాన హీరో విక్రమ్ ను తాజాగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దీని గురించి ఓ పోస్ట్ పెట్టాడు.

publive-image

కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రిషబ్ శెట్టి, తమిళ సినిమా ఇండస్ట్రీపై ఎంతో అభిమానం ఉన్న విషయం తెలిసిందే. తన ఇటీవలి పోస్ట్ లో విక్రమ్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన నటన, పాత్రధారణ, సినిమా పట్ల ఉన్న అభిమానం గురించి ప్రశంసలు కురిపించారు. 'నటుడిగా నేను కెరీర్ ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్న కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను.

publive-image

Also Read : మళ్ళీ ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్?

ప్రస్తుతం ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సర్' అని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' మూవీ ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ తాజాగా బెంగళూరు వెళ్లారు. అక్కడే రిషబ్ శెట్టి.. విక్రమ్‪‌ని కలిశాడు. తన సంతోషాన్ని ఫొటోలు, పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు.

publive-image

#kannada-actor-rishab-shetty #Chiyaan Vikram
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు