'చంద్రముఖి-2' నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా శనివారం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ ‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ లో కంగనా ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రముఖి-2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు..

'చంద్రముఖి-2' నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్
New Update

'చంద్రముఖి' సినిమా వచ్చి చాలా ఏళ్లు గడిచినా.. ఆ చిత్రాన్ని ఇంకా ప్రేక్షకులు ఎవరూ మరిచిపోలేదు. ఇప్పటికే ఈ సినిమా టీవీల్లో వేసినా.. అంతే ఇంట్రెస్టింగ్ చూస్తారు జనం. సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ.. అప్పట్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయంలో విద్యాసాగర్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా 'చంద్రముఖి-2' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఈ సీక్వెల్ లో కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘర లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి పీ వాసు దర్శకత్వం వహిస్తుండగా, సుభా స్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ఇటీవల చంద్రముఖి-2 మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శనివారం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ ‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ లో కంగనా ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చంద్రముఖి-2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల కానుంది. కాగా ఈ సినిమా వినాయక చవితి పండగక్కి పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

#first-look #film-news #kangana-ranaut #chandramukhi #latest-news #chandramukhi-2 #chandramukhi-2-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe