/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KANGANA-1-jpg.webp)
Kangana Ranaut Ayodhya:యావత్ ప్రపంచ ఎదురుచూస్తున్న ఘడియ మరికొన్ని గంటల్లో రానుంది. సోమవారం అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ ప్రపంచం కనులారా చూసేందుకు ఉవ్విళూరుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రమ్మంటూ ఆహ్వానాలు అందాయి. అందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) కూడా ఆహ్వానం అందింది. ఇక రేపే ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉండటంతో కంగనా ఈరోజే అయోధ్యకు చేరుకుంది. కాంజీవరం చీరకట్టుకుని...బంగారు నగలు ధరించి..కళ్లకు అద్దాలు పెట్టుకుని అయోధ్యలోని హనుమన్ ఆలయాన్ని(Hanuman temple) దర్శించుకుంది.
View this post on Instagram
అంతేకాదు గుడి ప్రాంగణాన్ని చీపురుపట్టి శుభ్రం చేసింది. తర్వాత అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది కంగనా. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామా..ఇక వచ్చేయ్..ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీరామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఆయన ఆధ్వర్యంలో హనుమాన్ యాగం చేశాను..అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా ఆనందంతో ఉప్పొంగుతున్నారని పోస్టు చేసింది.
ఇది కూడా చదవండి: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!!