Kangana Ranaut: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన కంగనా.. ఆమె ఎవరో తెలియదు?

సినీ నటి, ఏపీ మంత్రి రోజాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. రోజా అంటే ఎవరో తనకు తెలియదని అన్నారు. అలాంటివారు ఉన్నారన్న విషయమే తనకు తెలియదని.. ఆమె గురించి తానేం మాట్లాడతానని అన్నారు. ఇక రోజా తెలియదంటూ కంగనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Kangana Ranaut: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన కంగనా.. ఆమె ఎవరో తెలియదు?
New Update

Kangana Ranaut: మంత్రి రోజా (Minister Roja)పై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రముఖి-2 (Chandramukhi 2) ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెకు రోజా గురించి ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఉద్దేశించి రోజా(Roja) వ్యాఖ్యలపై స్పందించాలని కంగనాను మీడియా ప్రతినిధులు కోరారు. దీంతో రోజా అంటే ఎవరు? అని కంగనా ఎదురుప్రశ్న వేశారు. ఆమె ఎవరో తనకు తెలియనప్పుడు... ఆమె గురించి తాను ఏం మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అలాగే రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే తాను వదులుకోనని కంగనా క్లారిటీ ఇచ్చారు. తనకు దేశ భక్తి చాలా ఎక్కువని... అందుకే పేదలకు తనకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. ఇండియా పేరును భారత్ గా మార్చాలని తాను రెండేళ్ల క్రితమే చెప్పానన్నారు. తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని పేర్కొన్నారు. అందుకే తన వంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు.

కంగనా రనౌత్‌(Kangana Ranaut) తాజా చిత్రం ‘చంద్రముఖి-2(Chandramukhi 2). పి వాసు దర్శకత్వంలో లారెన్స్(Raghava Lawrence), కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం..సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) నయనతార (Nayanatara)జంటగా నటించిన చంద్రముఖి సినిమా గురించి తెలియని వారు ఉండరు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసునే పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Also: వివాదాల సుడిగుండంలో ‘టైగర్ నాగేశ్వరావు’.. సినిమాను నిలుపుదల చేస్తారా?

#ap-minister-roja #kangana-ranaut #kangana-ranaut-shocking-comments-on-roja #kangana-ranaut-comments-on-roja #kangana-ranaut-about-minister-roja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe