బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ని విభిన్నంగా ప్రమోట్ చేస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి టైటిల్ తదితర అప్ డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న నటి.. ఇందులో స్వయంగా తానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇటీవల విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడటంతో మరింత ప్రచారం మొదలుపెట్టిన కంగన.. నేరుగా ఇందిరాగాంధీతో చిట్ చాట్ నిర్వహించినట్లు తెలిపే ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది.
ఈ మేరకు అధునాతన ఏఐ సాంకేతికతతో ఈ దృశ్యం సాకారమైందని తెలుపుతూ నెట్టింట నోట్ షేర్ చేసింది కంగన. ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు తెలిపింది. అలాగే ప్రధాని మోదీ (ఏఐ ఇమేజ్)తో దిగిన చిత్రాన్ని నటి పోస్టు చేశారు. ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం కంగన సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్ అండ్ సౌండ్ షోలో ఆమె పాల్గొన్నారు. ‘పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా నా కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందొచ్చని చెప్పింది. చివరగా మన దేశానికి గాంధీ మహా పురుషుడు, మోదీ యుగ పురుషుడు అంటూ ప్రశంసలు కురిపించింది.
Also read : Pooja gandhi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న దండుపాళ్యం భామ!
ఇక ఈ సినిమా స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పరిగణించే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తుండగా.. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక సందర్భంలో ఈ సినిమా గురించి కంగన మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. అయితే ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ప్రకటించినప్పటికీ తాను నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అందుకే ఎమర్జెన్సీ సినిమాను కూడా 2024కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నటి.. త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని, అభిమానులు సహకరించాలని కోరింది.