Kangana: ఎట్టకేలకు నామినేషన్ వేసిన కంగనా రనౌత్.. ఎక్కడినుంచో తెలుసా?

ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున బరిలోకి దిగనుంది. నామినేషన్ కార్యక్రమానికి మండి ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.

New Update
Kangana: ఎట్టకేలకు నామినేషన్ వేసిన కంగనా రనౌత్.. ఎక్కడినుంచో తెలుసా?

Kangana: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుంది. మంగళవారం తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కంగన వెంట వచ్చిన ఆమె తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్‌తో పాటు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ అరంగేట్రం సమయంలో మండి ప్రజలు తమకు భారీ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisment
తాజా కథనాలు