Bigg Boss Buzz : సీజన్ 8 'బజ్' హోస్టుగా ఊహించని కంటెస్టెంట్.. ప్రోమో నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిగ్ బాస్ బజ్' టాక్ షో హోస్టును రివీల్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్ అర్జున్ సీజన్ 8 బజ్ హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రోమోను రిలీజ్ చేశారు. గత సీజన్‌కు బజ్ హోస్ట్‌గా గీతూ రాయల్ వ్యవహరించింది. By Archana 31 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss Buzz : వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఈ సారి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జునే షో హోస్టుగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో.. ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ డైలాగ్ అనే డైలాగ్స్ తో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఇక సీజన్ 8 హోస్టుగా నాగార్జున అనే విషయం పై క్లారిటీ అందరికీ ఓ క్లారిటీ ఉంది.. కానీ ఈ సారి 'బిగ్ బాస్ బజ్' హోస్ట్ గా ఎవరనే దాని పై నెట్టింట చాలా చర్చలే జరిగాయి. పల్లవి ప్రశాంత్, శివాజీ, శోభా శెట్టి ఇలా చాలా పేర్లే వినిపించారు. ఇక ఈరోజుతో ఈ సస్పెన్స్ కు తెరపడింది. 'బిగ్ బాస్ బజ్' హోస్ట్ గా అర్జున్ తాజాగా బిగ్ బస్ మేకర్స్ సీజన్ 8 బజ్ హోస్టును రివీల్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్ అంబటి అర్జున్ (Ambati Arjun) బిగ్ 'బాస్ సీజన్ 8 బజ్' హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలో హౌస్ లో తీసుకునే నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాలి.. ఈ సీట్ యమ హాట్ అనే డైలాగ్స్ తో అర్జున్ ఇంట్రో అదిరిపోయింది. గత సీజన్‌కు 'బజ్' షో హోస్టుగా గీతూ రాయల్ వ్యవహరించింది. బిగ్ బాస్ బజ్ అంటే ఏమిటి బిగ్ బాస్ బజ్ అనేది ఒక టాక్ షో. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ టాక్ షోలో పాల్గొంటారు. ఇందులో హోస్టుగా వ్యవహరించే వారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేస్తారు. హౌస్ లో వారి ఆటతీరును, బయటకు రావడానికి గల కారణాలను ఇక్కడ విశేషిస్తారు. Also Read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లో శివాజీ ఎంట్రీ ! కానీ కంటెస్టెంట్ కాదు.. ? - Rtvlive.com #ambati-arjun #bigg-boss-buzz-season-8 #big-boss-buzz-host #bigg-boss-8-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి