Kangana Ranaut: చంపేస్తామని బెదిరింపులు ... నిలిచిపోయిన కంగనా 'ఎమర్జెన్సీ' సెన్సార్ సర్టిఫికేట్! నటి కంగనా రనౌత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. కంగనా తాను నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెదిరింపుల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపింది. By Archana 31 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kangana Ranaut Emergency Movie: బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. దివంగత భారత ప్రధానీ ఇందిరాగాంధీ (Indira Gandhi) జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ టైంలో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, అప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏంటనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు! ఇది ఇలా ఉంటే కంగనా 'ఎమర్జెన్సీ' మూవీ విడుదలకు ముందే వివాదాలను చుట్టుముట్టింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ (Censor Certificate) జారీ ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా చెప్పింది. తాను నటించిన 'ఎమర్జెన్సీ' కి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కంగనా మాట్లాడుతూ.. మా సినిమా క్లియర్ చేయబడింది.. కానీ మాతో పాటు సెన్సార్ బోర్డుకు కూడా బెదిరింపులు వస్తునందున సర్టిఫికేషన్ నిలిపివేయబడింది. సినిమాలో ఇందిరా గాంధీ మరణాన్ని చూపించవద్దని, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను చూపించవద్దని, పంజాబ్ అల్లర్ల దృశ్యాలు చూపించవద్దని చెబుతున్నారు. మరి ఏమీ చూపించాలి అనేది మాపై ఒత్తిడిగా మారింది అని తన ఆవేదన వ్యక్తం చేసింది. "త్వరలోనే మా చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంటుందని ఆశీస్తున్నాను. సెన్సార్ బోర్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే నాకు సెన్సార్ బోర్డుపై నమ్మకం ఉంది. కానీ వాళ్ళు నా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. నా సినిమా కోసం నేను పోరాటం చేస్తాను ... అందుకోసం కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధం అంటూ చెప్పింది కంగనా". అయితే ఇటీవలే పంజాబ్ ఫరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో సిక్కులను తప్పుగా చూపించారని ఆరోపంచారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖను కూడా రాసినట్లు వార్తలు వచ్చాయి. Also Read: Bigg Boss Buzzz: సీజన్ 8 'బజ్' హోస్టుగా ఊహించని కంటెస్టెంట్.. ప్రోమో నెక్స్ట్ లెవెల్ - Rtvlive.com #actress-kangana-ranaut #emergency-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి