/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-22T180925.351-jpg.webp)
Kangana Ranaut: అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంనెలకొంది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ రాముడి పేరు ప్రతిధ్వనిస్తోంది. ప్రతీ ఒక్కరి నోట జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandhir) సందర్భంగా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు ఆలయం వద్ద సందడి చేశారు. అలియా భట్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, ఆలియా భట్, విక్కీ కౌశల్, చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్, రజినీకాంత్ (Rajinikanth) తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆలయ సముదాయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే తారల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఉన్నారు.
Also Read: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి
డాన్స్ వేసిన కంగనా రనౌత్
అయోధ్యలోని రామమందిరం వేడుకల్లో పాల్గొనేందుకు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి ఆదివారం వచ్చారు. రణ్ బీర్, బిగ్ బీ, అలియా, కత్రినా, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ కూడా ఇక్కడ కనిపించినప్పటికీ.. ఎక్కువగా చర్చించింది మాత్రం కంగనానే. రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా కంగనా నగలతో అలంకరించిన.. భారతీయ దుస్తుల్లో ఆనందంగా డ్యాన్స్ చేసింది. ప్రతిష్ఠాపన సమయంలో హెలికాఫ్టర్ ద్వారా ఆకాశం నుంచి పూల వర్షం కురిపిస్తున్న వేల కంగనా జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేసింది.
Also Read: Namrata Birth Day: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్