Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ట్విట్టర్ టాక్.. సేనాపతిగా కమల్ విశ్వరూపం, కానీ అదొక్కటే మైనస్..!

కమల్ హాసన్'భారతీయుడు 2' మూవీ నేడు (జులై 12) థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్ప‌టికే చాలా చోట్ల ఈ చిత్రం షోలు ప్రారంభం కావ‌డంతో అనేక మంది సినిమాను చూసి త‌మ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. విజువల్స్, కమల్ ఫెర్పార్మెన్స్, సోషల్ మెసేజ్ బాగుందని అంటున్నారు.

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ట్విట్టర్ టాక్.. సేనాపతిగా కమల్ విశ్వరూపం, కానీ అదొక్కటే మైనస్..!
New Update

Bharateeyudu 2 Twitter Review : కోలీవుడ్ (Kollywood) స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' (Bharateeyudu 2) నేడు (జులై 12) థియేటర్స్ లో రిలీజ్ అయింది. అప్పట్లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కడంతో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే ఓవర్సీస్ తో పాటూ చాలా చోట్ల ఈ చిత్రం షోలు ప్రారంభం కావ‌డంతో అనేక మంది సినిమాను చూసి త‌మ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. దాని ప్రకారం..

సినిమా ప్రారంభ‌మే టైటిల్స్‌తోనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడ‌ని, క‌మ‌ల్ హ‌స‌న్ ఎంట్రీ డీసెంట్‌గా స్టార్ట్ అయి, ఫ‌స్టాప్‌లో ఎంగేజింగ్ సీక్వెన్సులు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో అనిరుధ్ బీజీఎమ్ అదిరిపోయేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తి సీన్‌లో చాలా మంది ఆర్టిస్ట్స్‌తో క‌ల‌ర్ పుల్‌గా ఉంద‌ని, శంక‌ర్ మార్క్ విజువ‌ల్స్ ఎక్ట్రార్డిన‌రీగా ఉన్నాయంటున్నారు. క‌మ‌ల్ డ్యుయ‌ల్ రోల్స్ చేశాడ‌ని, మెసేజ్ గ‌ట్టిగానే చెప్పిన‌ట్టు చెబుతున్నారు.

Also Read : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘బేబీ’ నిర్మాత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

కొందరేమో సినిమా అక్క‌డ‌క్క‌డ స్లోగా సాగుతున్న‌ట్లు అనిపించినా విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌తో క‌ట్టి ప‌డేశార‌ని, క్లైమాక్స్ ఫైట్‌, ట్విస్టు సూప‌ర్‌గా ఉన్నాయ‌ని పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ క‌న్నా ఫ‌స్టాప్ సినిమాకు ప్ర‌ధాన బ‌ల‌మ‌ని, కామెడీ లేక‌పోవ‌డం మైన‌స్ అని అంటున్నారు.ఇంకొంతమంది యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Also Read : హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం

#kamal-haasan #shankar #bharateeyudu-2-twitter-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe