Bharateeyudu 2 : 'భారతీయుడు 2' మూవీ రివ్యూ.. శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? సేనాపతి తాత ఎలా చేశాడంటే?

కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫుల్ రివ్యూ కావాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' మూవీ రివ్యూ.. శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? సేనాపతి తాత ఎలా చేశాడంటే?
New Update

Bharateeyudu 2 Movie Review : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'భారతీయుడు 2'. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ నేడు (జులై 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం...

కథ విషయానికొస్తే...

స్వతంత్ర సమరయోధుడు అయినా సేనాపతి (కమల్ హాసన్) సమాజంలోని అవినీతిదారుల్ని, లంచగొండుల్ని ఏరిపారేస్తాడు. ఈక్రమంలో తన కొడుకు చందు (యంగ్ కమల్ హాసన్)ని కూడా వదిలిపెట్టడు. అవినీతి పరుడైన తన కొడుకుని కూడా వదలని సేనాపతి మళ్లీ ఇన్నేళ్ల తరువాత తిరిగి వస్తాడు. నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం మళ్లీ ఎలాంటి పోరాటం చేశాడు? నేటి యువతను ఈ పోరాటంలో ఎలా భాగస్వామిని చేశాడు? అసలు సేనాపతి తాత రావడాన్ని నేటి సమాజం ఎలా చూసింది? సమాజంలోని పౌరుల బాధ్యతల్ని సేనాపతి ఎలా గుర్తు చేశాడు? చివరకు లంచగొండి సమస్యని, అవినీతి మయమైన అధికారులను సేనాపతి ఎలా అంతం చేశాడు అనేదే ఈ సినిమా కథ.

Also Read : రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్!

విశ్లేషణ...

సేనాపతి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని అస్సలు సహించలేడు. తెల్లదొరల నుంచి విడిపించుకున్న ఈ దేశంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని ఎలా సహించలేకపోయాడు.. చివరకు తన కన్న కొడుకుని సైతం చంపేసేన సేనాపతి కథను మనం 'భారతీయుడు' లో చూసాం. అప్పటి తరానికి ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది. కానీ భారతీయుడు 2 లో మాత్రం ఆ కనెక్టివిటీ మిస్ అయింది. సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్ ఏమాత్రం కనిపించదు. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పటి తరంలో చాలా రొటీన్‌ అయిపోయాయి. అయితే వాటిని స్క్రీన్ పై ఎంత ఆసక్తిగా చూపిస్తామనే దానిపైనే రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. ఈ విషయంలో శంకర్ తన పట్టుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ భారతీయుడు స్థాయిలో ఆ మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

ఎవరెలా చేశారంటే...

సినిమా ఫస్టాఫ్ సిద్దార్థ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సెకండాఫ్ అయితే కమల్ హాసన్‌ స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో వన్‌ మ్యాన్‌ ఆర్మీ షోలా సాగుతుంది. శంకర్‌ ఎప్పటిలాగే మరో గట్టి సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సారి మాత్రం ఎగ్జిక్యూషన్‌లో కొంత వెనకబడ్డాడనే చెప్పాలి. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు మాత్రం కళ్లార్పకుండా చూసేలా గూస్‌బంప్స్‌ తెప్పించే సన్నివేశాలతో సాగుతుంది. సినిమా మొత్తంలో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి.

చివరగా చెప్పేదేంటంటే... 'భారతీయుడు' తో కంపేర్ చేయకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే కొంత వరకు ఎంజాయ్ చేయోచ్చు.

#kamal-haasan #shankar #bharateeyudu-2-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe