kalonji Benefits: ఆయుర్వేదంలో కలోంజి గింజలను నల్లజీలకర్ర, ఉపకుంచి అని పిలుస్తారు. వీటిని మసాలాగా వివిధ రకాల వంటకాల్లో వేస్తారు. వీటిని కూరల్లో వేస్తే రుచి కూడా కొంచం విభిన్నంగా ఉంటుంది. కలోంజి అనేక ఔషదగుణాలున్నాయి. పూర్వ కాలం నుంచి దీనిని వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు వాడేవారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు ఆక్సీకరణ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తుంది. మదుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఉబకాయం వంటి అనేక దీర్ఘకాలిక పరిస్ధితుల నుంచి రక్షించటంలో కలోంజి గింజలు కీలక పాత్ర పోషిస్తుంది.
కలోంజి పొడి వాడితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
యాంటీ ఇన్ ప్లమేటరీ లక్షణాలు:
ఆర్థరైటిస్ వంటి సమస్యకు ఈ గింజలు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉంటే థైమోక్వినోన్ ఉండటం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి.
గుండె ఆరోగ్యం:
ఈ చిన్న నల్లని విత్తనాలు హృదయానికి మేలు చేస్తాయి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, ఆరోగ్యకరమైన రక్తపోటును రాకుండా చేస్తుంది.
జీర్ణ వ్యవస్ధకు:
ఈ విత్తనాల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ. ఇవి జీర్ణవ్యవస్థకు మంచి పని చేస్తుంది. అజీర్ణం లక్షణాలను తగ్గించి జీర్ణశయాంతర ఆరోగ్యంగా ఉంచుంది.
బరువు తగ్గటం:
కలోంజీ విత్తనాలు రోజూ తింటే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. కలోంజీ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్, ఇన్ ఫ్లమేటరీ గుణాలు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మధుమేహం నిర్వహణ:
షుగర్ ఉన్నవారు డాక్టర్లను సంప్రదించి వారి సూచనలు, సలహాల మేరకు తీసుకుంటే మంచిది. ఈ విత్తనాలు రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది:
కలోంజి విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్లు, థైమోక్వినోన్‌తో ఉంటాయి. ఈ అనామ్లజనకాలు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షింస్తుంది.
మానసిక ఆరోగ్యానికి:
కలోంజి విత్తనాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సమర్థవంతంగాపని చేస్తాయి.వీటిని రోజూ ఆహారంలో తింటే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కలోంజి విత్తనాలు విటమిన్లు , ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలు ఉన్నాయి. వీటిని భోజనంలో తింటే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా పెరుగుతాయని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.
ముఖ్య గమనిక: కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే మంచి డాక్టర్లని సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకుంటే మంచిది.
ఇది కూడా చదవండి: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు