Kaloji: తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తి ఇమిడివుంది..కాళోజీని స్మరించుకున్న కేసీఆర్! తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ.. అంటూ కొనియాడారు. By srinivas 08 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR: తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కేసీఆర్ కొనియాడారు. పుట్టుక.. చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అలాగే నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా తమ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్ లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాళోజీ కవిత్వం, ఆలోచనలు అన్ని వేళలా ఆదర్శమని కేసీఆర్ అన్నారు. #telangana #kaloji-birthday #kcr-brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి