Kalki 2898 AD: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త?

ఏపీలో ప్రభాస్ 'కల్కీ' టికెట్ ధర రూ.400కు పెంచనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాకు లాభం చేకూరేలా చూడాలంటూ నిర్మాత అశ్వినీదత్ సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోగా వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

New Update
Kalki 2898 AD: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త?

'Kalki 2898 AD' Ticket Price: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో రాబోతున్న ‘కల్కీ 2898 AD’ టికెట్స్ రేట్స్ భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్టార్ నటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న విడుదలకానుండగా.. మేకర్స్ మొదటి వారం టికెట్ల ధరలను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో టికెట్ రేట్స్ పెంచేందుకు అనుమతివ్వాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని (CM Chandrababu Naidu) నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) అభ్యర్థించినట్లు తెలుస్తోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో టికెట్ ధరను రూ.400 విక్రయించుకునేలా పర్మిషన్ అడిగారని టాక్. అయితే కొత్త టిక్కెట్ రేట్లకు సంబంధించి చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదని, సాధ్యమైనంతవరకూ ప్రయోజనం చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

మొదటి రోజు అర్ధరాత్రి షోలకు..
అయితే మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా.. కచ్చితమైన టికెట్ రేట్ల పెంపుపై వచ్చే వారం క్లారిటీ రానుంది. మొదటి రోజు అర్ధరాత్రి షోలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూటర్లకు దత్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా.. అందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందే పనిలో ఉన్నారు. ఇక USAలో ఈ సినిమా టిక్కెట్‌లను ప్రీమియం ధరకు విక్రయిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో రూ.3 వేలకు పైగానే అమ్ముడవుతున్నట్లు డిస్టిబ్యూటర్స్ వెల్లడించారు.

బెనిఫిట్ షోలతోనూ పెద్ద మొత్తం ఆదాయం..
కల్కి 2898 ఏడీ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని ఇండియన్ సినిమా రికార్డులూ బ్రేకవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. టికెట్ల ధరల పెంపుతోపాటు మూవీకి ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత షోల కోసం కూడా అనుమతి కోరనున్నారు. అదే జరిగితే జూన్ 26 అర్ధరాత్రి తర్వాత నుంచే కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే ఉంది. థియేట్రికల్, డిజిటల్ హక్కుల రూపంలోనే మేకర్స్ కు తాము పెట్టిన బడ్జెట్ తో పెద్దమొత్తం తిరిగి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్, టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలతోనూ పెద్ద మొత్తం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు.

Also Read: ట్రెండింగ్ లో ‘GOAT’ గ్లింప్స్ … డ్యూయల్ రోల్ లో విజయ్ మాస్ యాక్షన్ …!

Advertisment
తాజా కథనాలు