Kalki Fan War After Movie Release : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యద్దానికి సంబంధించి చూపించిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.అలాగే ప్రభాస్-అమితాబ్ పెర్ఫార్మెన్స్ నాగ్ అశ్విన్ మేకింగ్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేసాయి.
సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకులకు బాగానే నచ్చింది. 'కల్కి' రిలీజ్ తర్వాత తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ వార్ నడుస్తోంది. అది మహాభారతంలోని రెండు పాత్రల మధ్య కావడం గమనార్హం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంభాలాలో కల్కి పుట్టక ముందు ఏం జరుగుతుందో ఊహించి 'కల్కి' కథను రాసుకున్నాడు. సినిమా క్లైమాక్స్‌లో కురుక్షేత్ర యుద్ధంలోని అర్జున-కర్ణ యుద్ధ ఘట్టాన్ని తెరపై చూపించాడు. ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ అద్భుతంగా నటించారు.
Also Read : ‘కల్కి’ లో కృష్ణుడిగా నటించిన ఇతను ఎవరో తెలుసా?
ఈ ఎపిసోడ్ కొన్ని సెకన్ల పాటు వచ్చి వెళ్లినా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ సీన్‌లో ప్రస్తావనకు వచ్చిన ఓ అంశం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. కర్ణుడు, అర్జునుడి మధ్య ఎవరు బలవంతుడు అనే వాదన మొదలైంది. 'కల్కి 2898 క్రీ.శ.' సినిమాలో కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడని చెప్పే సన్నివేశం ఉంది. అయితే కొందరు దీనిని కొందరు యాక్సెప్ట్ చేయడం లేదు. వ్యాసభారతంలో అలాంటి ప్రస్తావన లేదని వాళ్ళు చెబుతున్నారు.
దీనిపై పలువురు నెటిజన్స్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరో.. దాంతో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర హైలైట్ అవుతోంది. అర్జునుడి కంటే కర్ణుడు బలవంతుడని వ్యాసభారతం చెప్పలేదని నెట్టింట ఫ్యాన్ వార్ నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో కర్ణుడు బలవంతుడే అని అంటున్నారు. నిజానికి కర్ణుడు అర్జునుడి సోదరుడు కూడా. కానీ విధి అతని స్వంత సోదరులతో యుద్ధంలో పాల్గొనేలా చేసింది. కానీ మహాభారతంలో వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన పాత్రలుగా మిగిలిపోయారన్నది మాత్రం వాస్తవం.